- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Social Media Ban: అండర్-16 పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఆస్ట్రేలియా బాటలో మరో దేశం
చిన్నారులు ఉపయోగించకుండా సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. సోషల్ మీడియా కారణంగా చిన్నా పెద్దా తేడా లేకుండా గంటల తరబడి ఈ యాప్స్ లోనే కాలం గడిపేస్తున్నారు. ఇలాగే కొనసాగితే పెద్దల సంగతి అలా ఉంచితే చిన్నారుల భవిష్యత్‍పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశ చట్టసభల్లో ఇటీవల ఓ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు వచ్చే నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. అయితే సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా బాటలోనే మరో దేశం పయనించాలని భావిస్తోంది. మలేషియా (Malaysia) సైతం అండర్ 16 పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని (Social Media Ban) అమలు చేసే ప్లాన్ చేస్తున్నదని, సామాజిక మాధ్యమాలపై పరిమితులు విధించడంలో ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలు ఎలా వ్యవహరిస్తున్నాయో తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని మలేషియా కమ్యూనికేషన్ మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ తెలిపినట్లు స్థానిక మీడియా కథనం వెలువరించింది. వచ్చే ఏడాది నాటికి సోషల్ మీడియా మీడియా ఖాతాలను 16 ఏళ్లలోపు వారు తెరవకుండా నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోందని ఈ విషయంలో ప్రభుత్వం, తల్లిదండ్రులు తమ పాత్రలను పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనే క్రమంలో మలేషియా ఇటీవల సోషల్ మీడియా సేవలపై తన పర్యవేక్షణను కఠినతరం చేసింది.
కాగా సెప్టెంబర్‌లో స్థానిక మీడియా విడుదల చేసిన ఇప్సోస్ మలేషియా ఎడ్యుకేషన్ మానిటర్ 2025 సర్వేలో మలేషియాలో 72 శాతం మంది ప్రతివాదులు పిల్లలలో సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయాలని అంగీకరించారు. ఆస్ట్రేలియాలో (Australia) ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వచ్చే డిసెంబర్ 10 నుండి 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఖాతాదారులను తొలగించాల్సి ఉంటుంది. లేదా భారీ జరిమానాలను విధించేలా అక్కడి ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఇక పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయడంపై న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కూడా ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ఈ ఏడాది డచ్ ప్రభుత్వం తల్లిదండ్రులకు 15 ఏళ్లలోపు పిల్లలు టిక్ టాక్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా యాప్ లను ఉపయోగించకుండా నిషేధించాలని సూచించింది. ఇక ఈయూ దేశాలు-డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ దేశాలు తమ దేశాల్లో సోషల్ మీడియా వినియోగదారుల వయస్సులను తనిఖీ చేయడం ద్వారా పిల్లలు ఆన్ లైన్ లో హానికరమైన కంటెంట్ ను యాక్సెస్ చేయకుండా నిరోధించే లక్ష్యంతో ఒక యాప్ ను పరీక్షిస్తున్నారు.






