Khawaja Asif: మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాక్ రక్షణ మంత్రి ఖవాజ అసీఫ్

by Shamantha N |

పహెల్గాం దాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. పాకిస్థాన్ రాజకీయ నాయకులు భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.

Khawaja Asif: మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాక్ రక్షణ మంత్రి ఖవాజ అసీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం దాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. పాకిస్థాన్ రాజకీయ నాయకులు భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. కాగా.. 36 గంటల్లో మా పై భారత్‌ దాడి చేయడం ఖాయం అంటూ గగ్గోలు పెట్టిన పాక్‌ రక్షణ మంత్రి ఖవాజ అసీఫ్‌ ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. ఆయన 36 గంటలు అని చెప్పి నాలుగు రోజులు దాటినా.. భారత్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రెచ్చగొట్టేలా మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఆయన పాక్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికే తమ గగనతలంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన రఫేల్‌ యుద్ధ విమానాలను అడ్డుకొన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

నీటి మళ్లింపు కూడా దౌర్జన్యమే..

కాగా.. జియో న్యూస్ కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఖవాజ అసీఫ్ మాట్లాడుతూ.. సింధు నదిపై భారత్‌ నిర్మించే కట్టడాన్ని అయినా దాడి చేసి కూల్చేస్తామని పేర్కొన్నారు. అసలు భారత్‌ దీనిపై నిర్మాణాలకు చేపట్టడాన్ని అన్యాయంగా భావిస్తామన్నారు. ‘దౌర్జన్యం అంటే కేవలం కాల్పులు మాత్రమే కాదు.. అది చాలా రూపాల్లో ఉంటుంది. నీటి ఆపటం, మళ్లించడం వంటి కూడా అదే. ఇదే జరిగితే పాక్‌లో ఆకలి చావులను చూస్తాము. వారు ఏదైనా నిర్మాణానికి యత్నిస్తే.. పాక్‌ దానిని కూల్చేస్తుంది’ అంటూ బెదిరింపులకు దిగారు. కాలం గడిచేకొద్దీ భారత్‌తో ఘర్షణలు పెరుగుతాయేకానీ, తగ్గవని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు చాలా దేశాలు యత్నిస్తున్నాయన్నారు. అయితే, మరో 24-36 గంటల్లో తమపై సైనిక చర్య చేపడుతుందని గతనెల చివర్లో ఆయన సంచలన ప్రకటన చేశారు. భారత్‌లో సీసీఎస్‌ సమావేశం ముగిసిన వెంటనే ఈ ప్రకటన రావడం గమనార్హం. కానీ, అలాంటి ఘటనలు జరగకపోవడంతో తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

Next Story