పాకిస్థాన్‌కు మరో షాక్ ఇచ్చిన తాలిబన్ కంట్రీ

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్‌కు తాలిబన్ కంట్రీ ఆఫ్గనిస్తాన్ మరో షాక్ ఇచ్చింది. భారత్ చేసినట్టే పాకిస్థాన్‌కు వెళ్లే నదీ జలలాను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆఫ్గనిస్థాన్ సమాచార మంత్రిత్వ ఈ మేరకు ప్రకటన చేసింది.

పాకిస్థాన్‌కు మరో షాక్ ఇచ్చిన తాలిబన్ కంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌కు తాలిబన్ కంట్రీ ఆఫ్గనిస్తాన్ మరో షాక్ ఇచ్చింది. భారత్ చేసినట్టే పాకిస్థాన్‌కు వెళ్లే నదీ జలలాను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆఫ్గనిస్థాన్ సమాచార మంత్రిత్వ ఈ మేరకు ప్రకటన చేసింది. కునార్ నదిపై సాధ్యమైనంత త్వరగా డ్యామ్ నిర్మించాలని తమ సుప్రీం నాయకుడు మౌలావి హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశించినట్టు పేర్కొంది.

పాకిస్థాన్ ఆఫ్గనిస్థాన్ మధ్య యుద్ద విరమణ తరవాత ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక పహల్గామ్ ఎటాక్ తరవాత భారత్ కూడా పాకిస్థాన్ కు వెళ్లే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఆఫ్గన్ సైతం పాక్ తో యుద్ధవిరమణ చేసినప్పటికీ వాటర్ వార్ మొదలుపెడుతుందని అర్థం అవుతోంది. అదే జరిగితే ఇటు సింధూ నదీ జాలాలు రాక, అటుకునార్ నది జాలాలు రాక పాక్ నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.

Next Story