- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15 చెక్ పోస్టులు స్వాధీనం...పాక్-అఫ్గాన్ బార్డర్‌లో యుద్ధ వాతావరణం
డ్యూరాండ్ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది, 15 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందో ? అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇటీవల వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ప్రతికారంగా తాలిబన్లు రంగంలోకి దిగారు. పాకిస్తాన్ కు కౌంటర్ ఇచ్చేందుకు భారీ ఆపరేషన్ మొదలుపెట్టారు తాలిబన్లు. ఇందులో భాగంగానే డ్యూరాండ్ రేఖ వెంట పాకిస్తాన్ కు సంబంధించిన 15 పోస్టులను ఆధీనంలోకి తీసుకుంది ఆఫ్గనిస్తాన్.
15 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ 15 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకునే క్రమంలో మొత్తం 40 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసినట్లు తాలిబన్లు వెల్లడించారు. మరి కొంత మంది పాకిస్తాన్ సైనికులు తమ ఆధీనంలో బందీగా ఉన్నారని ప్రకటన చేసింది తాలిబన్ సర్కార్. అదే సమయంలో పాకిస్తాన్ కూడా దీటుగా బదులు ఇచ్చేందుకు సిద్ధం అవుతోందట. ఇందులో భాగంగానే బార్డర్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకుంటోంది పాకిస్తాన్. అటు పలువురు తాలిబన్లను చంపామని పాకిస్తాన్ చెబుతోంది. దీంతో రెండు దేశాల బార్డర్ లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పాకిస్తాన్ ఇటీవల వైమానిక దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ క్రికెటర్ నజీబుల్లా తారకై మరణించాడు.






