24 కు చేరిన అఫ్ఘాన్ భూకంప మృతుల సంఖ్య.. ఆపద సమయంలో అండగా భారత్

by Prasad Jukanti |

అప్ఘాన్ ను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి.

24 కు చేరిన అఫ్ఘాన్ భూకంప మృతుల సంఖ్య.. ఆపద సమయంలో అండగా భారత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అప్ఘానిస్థాన్‍ను భూకంపాలు (Afghanistan earthquake) భయపెడుతున్నాయి. తాజాగా సోమవారం తెల్లవారుజాము సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 24 కు చేరిందని అప్ఘాన్ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. తాలిబాన్ ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ప్రకారం ఉత్తర ప్రావిన్సులలో సుమంగాన్ బాల్ఖ్ లో దాదాపు 530 మంది గాయపడ్డారు. ఖుల్మ్ పట్టణానికి 22 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. ఈ సంస్థ అంచనా ప్రకారం భూకంప తీవ్రత 6.3గా నమోదై 28 కిలోమీటర్ల లోతులో ఉంది. ఆదివారం అర్థరాత్రి దాటాక 12:59 గంటలకు భూమి కంపించింది. బల్ఖ్, సమంగన్, బాగలాన్ ప్రావిన్స్ లను భూకంపం తాకింది. భూకంపం కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయి. కీలకమైన రవాణా మార్గాలు తెగిపోయాయి. భూకంపం నేపథ్యంలో భారతదేశం అఫ్గాన్ కు ఆహారం, మందులతో సహా సహాయ సామాగ్రిని పంపింది. కాగా గత ఆగస్టులో తూర్పు అఫ్ఘానిస్తాన్ లో 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Next Story