- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash : విమాన ప్రమాదంపై విదేశాంగశాఖ కీలక ప్రకటన
గుజరాత్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)పై విదేశాంగశాఖ(Ministry of Foreign Affairs) కీలక ప్రకటన జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)పై విదేశాంగశాఖ(Ministry of Foreign Affairs) కీలక ప్రకటన జారీ చేసింది. విమాన ప్రమాదంలో చాలామంది చనిపోయారని, వారి సంఖ్య ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారికి అండగా ఉంటామని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. కాగా ప్రమాద క్షతగాత్రులను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్(CM Bhupendra Patel) సివిల్ ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడిన వారికి రక్తం అత్యవసరమని, పెద్ద ఎత్తున ప్రజలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ వెళ్తున్న ఎయిర్‌ఇండియా(Air India Flight Crash)కు చెందిన AI 171 బోయింగ్ విమానం టేకాఫ్ అయిన వెంటనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్, మరో రెండు భారీ భవనాలపై కుప్పకూలింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదస్థలి, సివిల్ ఆసుపత్రిలో పరిస్థితి భీతావాహంగా ఉంది. కాగా ఈ ప్రమాదంలో 150 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మరోవైపు మెడికల్ కాలేజీకి చెందిన 20 మంది మెడికోలు కూడా దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.






