Supreme Court: పథకాల ప్రకటనల్లో సీఎం ఫోటోలు ఓకే.. మద్రాసు హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం

by Prasad Jukanti |

మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Supreme Court: పథకాల ప్రకటనల్లో సీఎం ఫోటోలు ఓకే.. మద్రాసు హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు జీవించి ఉన్న రాజకీయ నేతల పేర్లు పెట్టకూడదంటూ ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు జీవించి ఉన్న సీఎంల పేర్లు, ఫోటోలు వాడొద్దంటూ మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.రాజకీయాలు ఎన్నికల్లో చూసుకోవాలని రాజకీయాల కోసం కోర్టులను ఉపయోగించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ వేసిన అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం కు సుప్రీంకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని పేదల కోసం రాష్ట్ర పథకంలో ఉపయోగించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.

ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరును కలుపుకుని ‘ఉంగలుడన్‌ స్టాలిన్‌’, ‘స్టాలిన్‌ విత్‌ యు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి పేరుతో మరో ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై అన్నాడీఎంకే నేత సీవీ సీవీ షణ్ముగం మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సంక్షేమ పథకాల్లో రాజకీయ ప్రముఖులను పొందుపరచి రాష్ట్రం ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను, ప్రభుత్వ ప్రకటన మార్గదర్శకాలు–2014ను ఉల్లంఘించిందని వాదించారు. ఈ పిటిషన్ ను విచారించిన మద్రాసు హైకోర్టు.. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు జీవించి ఉన్న రాజకీయ నేతల పేర్లు పెట్టడం లేదా ప్రభుత్వ ప్రచార సామగ్రిలో మాజీ ముఖ్యమంత్రులు లేదా సైద్ధాంతిక నాయకుల ఫోటోలను ఉపయోగించవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించగా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Next Story