- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివసేన(యూబీటీ) MLAల ప్రమాణ స్వీకారంపై ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
శివసేన(యూబీటీ) ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం లేదని ఆ పార్టీ ముఖ్య నేత ఆదిత్య ఠాక్రే తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో : శివసేన(యూబీటీ) ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం లేదని ఆ పార్టీ ముఖ్య నేత ఆదిత్య ఠాక్రే తెలిపారు. శనివారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిత్య ఠాక్రే పార్టీ శ్రేణులతో కలిసి విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో శివాజీ మహారాజ్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు శివసేన(యూబీటీ) నేతలు ప్రమాణ స్వీకారం చేయడం లేదు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే వారు ఎందుకు సంబరాలు చేసుకోవడం లేదు. ఎక్కడా కూడా కూటమి గెలుపు తర్వాత ప్రజలు ప్రజలు విజయోత్సవాల్లో పాల్గొనలేదు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి.’ అని ఆయన అన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మూడు రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. శుక్రవారం ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాలిదాస్ సులోచనా కొలొంబ్కర్‌తో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు.






