- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌర జ్వాల కెర్నల్‌ను ఫొటో తీసిన ఆదిత్య ఎల్-1
ఆదిత్య-L1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇండియా చేపట్టిన మొట్టమొదటి అంతరిక్ష యాత్ర.

- ఇస్రో చరిత్రలో కీలక ఘట్టం
- సూర్యుడిపై వాతావరణం అర్థం చేసుకోవడంలో ముందడుగు
దిశ, నేషనల్ బ్యూరో: ఇస్రో చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టం నమోదైంది. సౌర జ్వాలలకు సంబంధించిన చిత్రాలను ఆదిత్య ఎల్1 తొలి సారి తీసి పంపించింది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించారు. 127 రోజుల పాటు ప్రయాణించిన తర్వాత ఆదిత్య ఎల్-1 సూర్యుడి సమీపంలోని లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆదిత్య ఎల్-1ను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అయితే ఇన్నాళ్లకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సూర్యుడి నుంచి అకస్మాతుగా, శక్తివంతంగా విస్పోటనం అయ్యే సౌర జ్వాలలను ఫొటోలు తీసింది. సూర్యుని అయస్కాంత శక్తి విస్పోటనం చెందినప్పుడు కాంతి, రేడియేషన్, అధిక శక్తి కణాలతో శక్తిని విడుదల చేస్తుంది. అలాంటి సమయంలో వెలువడే జ్వాలలను తొలి సారి ఆదిత్య ఎల్1 ఫొటోలు తీసి పంపించింది.
ఆదిత్య-L1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇండియా చేపట్టిన మొట్టమొదటి అంతరిక్ష యాత్ర. ఇది నియర్ అల్ట్రా-వయోలెట్ బ్యాండ్ చిత్రాలను ఉపయోగించి దిగువ సౌర వాతావరణంలో సౌర జ్వాల "కెర్నల్" మొదటి చిత్రాన్ని తొలి సారిగా తీసి పంపించింది. ఇది సూర్యుని పేలుడు కార్యకలాపాలను, భూమిపై వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇస్రోకు సహాయపడుతుంది. ఆదిత్య ఎల్1లో అత్యంత అధునాతన పరికరాలు ఉన్నాయి. ఇవి వివిధ ఫ్రీక్వెన్సీల్లో సౌర జ్వాలలను అధ్యయనం చేస్తాయి. నియో అల్ట్రా-వయోలెట్ శ్రేణిలోని 11 వేవ్ బ్యాండ్‌లో హై రిజల్యూషన్ చిత్రాలను తీస్తుంది. భూ వాతావరణ ఈ హానికారిక కిరణాలను అడ్డుకుంటుంది. అందుకే ఆదిత్యా ఎల్1ను ఎలాంటి అడ్డంకులు లేని లాగ్రాంజ్ పాయింట్ 1లో ప్రవేశపెట్టి.. సూర్యుడి వాతావరణాన్ని అధ్యయనం చేస్తోంది.






