ఇజ్రాయెల్‌లో అదానీ గ్రూప్ నిర్వహించే పోర్టు భద్రం..!

by Phanindra |

ఇజ్రాయెల్‌లో అదానీ గ్రూప్ నిర్వహించే పోర్టు భద్రంగా ఉందని, ఇరాన్ దాడుల్లో ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం.

ఇజ్రాయెల్‌లో అదానీ గ్రూప్ నిర్వహించే పోర్టు భద్రం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన హైఫా పోర్టుకు ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. పోర్టులో కార్గో కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇజ్రాయెల్‌పై దాడుల్లో భాగంగా హైఫా పోర్ట్, దానికి సమీపంలోని ఆయిల్ రిఫైనరీని ఇరాన్ దళాలు టార్గెట్ చేశాయి. అయితే ఈ దాడులు పోర్టుపై ఎలాంటి ప్రభావం చూపలేదట.


దీనిపై జరిగిన దాడులను ఇజ్రాయెల్ నిరోధించగలిగిందట. పోర్టులో 8 షిప్స్ ఉన్నాయని, వాటికి ఎలాంటి నష్టం జరగలేదని, అలాగే పోర్టులో కార్గో కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్ చేసుకునే దిగుమతుల్లో హైఫా పోర్టులోనే 30 శాతం జరుగుతాయని అంచనా. అయితే ఈ విషయంపై అటు అదానీ గ్రూప్ కానీ, ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Next Story