పార్లమెంట్‌లో అదానీ- హిండెన్ బర్గ్ దుమారం!

by Disha Web Desk 4 |
పార్లమెంట్‌లో అదానీ- హిండెన్ బర్గ్ దుమారం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం గురువారం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభల్లో అదానీ గ్రూప్ కంపెనీల వ్యవవరంపై దుమారం రేగింది. అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికపై తక్షణమే చర్చ చేపట్టాలని పార్లమెంట్‌లో విపక్షాలు పట్టుబడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలిగే అంశం కావడంతో ఈ విషయంపై తక్షణమే డిబేట్ జరగాలని విపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. విపక్ష సభ్యుల నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. దీంతో లోక్ సభను స్పీకర్ ఓం బిర్లా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరో వైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

బీఆర్ఎస్ వాయిదా తీర్మానం:

అదానీ గ్రూప్ సంస్థలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఇవాళ ఉదయం బీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్ సభలో ఎంపీ నామానాగేశ్వర్ రావు, రాజ్యసభలో కేశవరావు తన వాయిదా తీర్మానం ఇచ్చారు. దేశ ప్రజలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే రీతిలో ఉన్న హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం లేఖలో పేర్కొన్నారు. అదానీ గ్రూప్ పాల్పడిన ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఉభయ సభల్లోనూ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.

'అదానీ'పై ఆర్బీఐ నజర్

రోజు రోజుకు అదానీ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు స్థానిక బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఎంత మేర రుణలు తీసుకున్నాయి. వాటి వివరాలను ఇవ్వాలని ఆర్‌బీఐ ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులను కోరినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

అదానీ సంచలన నిర్ణయం:

మార్కెట్‌లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో అదానీ సంచలన నిర్ణయం తీసుకున్నరు. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ షేర్ ధర పతనం అవుతున్నందున ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్ పీఓ)డబ్బులు ఇన్వెస్టర్లకు వెనక్కి ఇస్తున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకే ఎఫ్‌పీఓ డబ్బు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు అదాని స్పష్టం చేశారు.



Next Story