భారత సైన్యానికి క్షమాపణలు చెప్పిన నటి రిచా చద్దా

by Malleboina Mahesh |   (  Updated:2022-11-24 13:29:36  IST  )

భారత సైన్యాన్ని అవమానిస్తూ ట్వీట్ చేసిన నటి రిచా చద్దా తన ట్వీట్ ను తొలగించడమే కాకుండా భారత సైన్యానికి క్షమాపణలు కూడా చెప్పింది. ఈ సందర్భంగా ఆమె ఇలా రాసింది.

భారత సైన్యానికి క్షమాపణలు చెప్పిన నటి రిచా చద్దా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సైన్యాన్ని అవమానిస్తూ ట్వీట్ చేసిన నటి రిచా చద్దా తన ట్వీట్ ను తొలగించడమే కాకుండా భారత సైన్యానికి క్షమాపణలు కూడా చెప్పింది. ఈ సందర్భంగా ఆమె ఇలా రాసింది. "తమ కొడుకు అమరవీరుడు అయినప్పుడు లేదా గాయపడినప్పుడు కుటుంబం మొత్తం ప్రభావితమవుతుంది.. అది ఎలా ఉంటుందో నాకు వ్యక్తిగతంగా తెలుసు. అని రాసుకొచ్చింది. కాగా నిన్న " పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. "గల్వాన్ హాయ్ చెప్పారు" అని ఆమె ట్వీట్ చేయడంతో ఆమెను చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో నటి ఆర్మీకి క్షమాపణలు చెప్పింది.

Read More: భారత సైన్యాన్ని అవమానించేలా నటి Richa Chadha (రిచా చద్దా)ట్వీట్..

Read More: భారతీయులకు మరొకరి విజయం మింగుడుపడదు : Priyanka Chopra

Next Story