- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆన్ లైన్ గేమింగ్ పై నిషేధం విధించాలి.. ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యపై సోనూసూద్
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు చెప్పినందుకు ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు చెప్పినందుకు ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 12, 14, 16 సంవత్సరాలు గల ముగ్గురు అక్కా చెల్లెల్లు కొరియన్ గేమ్ కు అలవాటు పడ్డారు. అది కాస్తా వారికి వ్యసనంగా మారడంతో ఆడవద్దని తల్లిదండ్రులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు సైతం నిర్దారించారు. కాగా ఈ ఘటనపై సినీనటుడు సోనూసూద్ స్పందించారు. మైనర్ లు డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు దూరంగా ఉండేలా కఠినమైన చట్టాలు తీసుకుని రావాలన్నారు. తక్షణమే ఆంక్షలు విధించాలని చెప్పారు.
అధిక స్క్రీన్ ఎక్స్ పోజర్ సైలెంట్ గా ప్రజారోగ్య సమస్యగా మారుతోందని హెచ్చరించారు. సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ గేమింగ్ ఆడకుండా 16ఏళ్లలోపు పిల్లలపై ఆంక్షలు విధించాలన్నారు. డిజిటల్ మీడియాలో చదువుకు సంబంధించినవి తప్ప మరేం చూడకుండా చేయాలన్నారు. బాల్యానికి అల్గారిథం కాదని మార్గదర్శకత్వం ముఖ్యమని పేర్కొన్నారు. ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంది హింసవల్ల, పేదరికం వల్ల కాదని ఆన్ లైన్ గేమింగ్ మరియు డిజిటల్ వ్యసనం వల్ల కనిపించని ఒత్తిడివల్ల అని చెప్పారు. తాను ఇదివరకే చెప్పానని మళ్లీ చెబుతున్నానని 16ఏళ్ల పిల్లలు సోషల్ మీడియా వాడటం, ఆన్ లైన్ గేమింగ్ ఆడటంపై ఆంక్షలు విధించాలన్నారు. ఆలస్యం చేయవద్దని దీనిని మర్చిపోకుండా చేయాలన్నారు.






