హైదరాబాద్ హోటళ్లలోనూ అలాంటివి చూశా.. ఎప్‌స్టీన్ ఫైల్స్ పై నా అన్వేషణ సంచలనం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-05 06:55:00  IST  )

ఎప్‌స్టీన్ ఫైల్స్ పై యూట్యూబర్ నా అన్వేషణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎప్ స్టీన్ ఫైల్స్ అనేది జరగటానికి కారణం కన్యత్వం ఉన్న అమ్మాయిలను కోరుకోవడమేనని చెప్పారు.

హైదరాబాద్ హోటళ్లలోనూ అలాంటివి చూశా.. ఎప్‌స్టీన్ ఫైల్స్ పై నా అన్వేషణ సంచలనం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. జెఫ్రీ ఎస్టీన్‌కు చెందిన ఓ ఐలాండ్‌లో ప్రపంచంలోనే ప్రముఖులుగా పేరున్న కొందరు.. మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేశారని, ఆ ఐలాండ్ లో దారుణాలు జ‌రిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫైల్స్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు ఉండగా ఆయనకు సంబంధించిన వీడియోలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. జెఫ్రీ చిన్న పిల్లలను శృంగారం కోసం స‌ప్లై చేయ‌గా ట్రంప్ మాత్రమే కాకుండా జెఫ్రీని కలిసిన ప్రతిఒక్కరి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాగా ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ పై యూట్యూబర్ నా అన్వేషణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎప్ స్టీన్ ఫైల్స్ అనేది జరగటానికి కారణం కన్యత్వం ఉన్న అమ్మాయిలను కోరుకోవడమేనని చెప్పారు. డబ్బున్న ప్రముఖులు వయసు పైబడిన వాళ్లు తమ భార్యతో సుఖం పొందడం సాధ్యపడక ఇలాంటి దారుణాలకు పాల్పడతారని అన్నారు. తన ప్రపంచయాత్రలో చూశానని చాలా ఐలాండ్ లలో ఇలాంటి దారుణాలే జరుగుతాయని అన్నారు. థాయిలాండ్ లో వేల మంది 20ఏళ్ల అమ్మాయిలు వ్యభిచార వృత్తిలో ఉంటార‌ని అక్క‌డి రాక‌ముందే వాళ్ల క‌న్య‌త్వాన్ని విదేశాల‌కు చెందిన వారికి బ్రోక‌ర్లు అమ్ముకుంటార‌ని చెప్పారు.

ఇలాంటివి ప్ర‌పంచ వ్యాప్తంగానే జ‌రుగుతున్నా 13,14 ఏళ్ల వ‌య‌సు చిన్నారులు కూడా ఎప్ స్టీన్ ఫైల్స్ లో ఉండ‌టం దారుణం అని అన్నారు. ఇక హైదరాబాద్ లో తాను హోట‌ల్ లో పనిచేస్తున్న స‌మ‌యంలోనూ కొన్ని దారుణాలు చూసిన‌ట్టు చెప్పాడు. స్టార్ హోట‌ల్స్ లో తాను ప‌నిచేశాన‌ని అక్క‌డ‌కు సెల‌బ్రెటీలు వ‌చ్చేవార‌ని చెప్పాడు. స్టోరీ డిస్క‌ర్ష‌న్స్ పేరుతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, హీరోలు, నిర్మాత‌లు వ‌చ్చేవారని చెప్పాడు. వాళ్ల పేర్లు బ‌టయ‌కు చెప్ప‌లేమ‌ని అన్నారు. గోవా హోట‌ల్స్ లో ప‌నిచేసిన‌ప్పుడు కూడా అలాంటివి చూశాన‌ని అన్నారు.

ఆన్ లైన్ గేమింగ్ పై నిషేధం విధించాలి.. ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యపై సోనూసూద్

Next Story