ఈడీ విచారణకు హాజరైన నటుడు సోను సూద్

by Malleboina Mahesh |

అక్రమ బెట్టింగ్ యాప్ 1xBet, మనీలాండరింగ్ కు సంబంధించిన కేసులో భాగంగా నటుడు సోను సూద్ ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యాడు.

ఈడీ విచారణకు హాజరైన నటుడు సోను సూద్
X

దిశ, వెబ్ డెస్క్: అక్రమ బెట్టింగ్ యాప్ 1xBet, మనీలాండరింగ్ (Money laundering) కు సంబంధించిన కేసులో ప్రముఖ క్రికెటర్లతో పాటు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు (ED Notices) జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు సోను సూద్‌ (Bollywood actor Sonu Sood)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 17న నోటీసులు ఇచ్చింది. అందులో సెప్టెంబర్ 24న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈడీ నోటీసులను అందుకు నటుడు సోను సూద్ ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయాని (Delhi ED Office)కి చేరుకున్నారు. ప్రస్తుతం సోనూ సూద్ ను ఈడీ అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈడీ అధికారులు 1xBet యాప్ ద్వారా అక్రమ నిధుల లావాదేవీలు, పన్ను ఎగవేత, ప్రజలను మోసం చేయడం వంటి అంశాలను దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికే క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, శిఖర్ ధావన్, సురేష్ రైనా, అలాగే సినీ ప్రముఖులు మిమి చక్రవర్తి, ఊర్వశి రౌతేలా, అంకుష్ హజ్రా కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సోనూ సూద్ న్యాయవాది శశి కౌశిక్ వెల్లడించినట్లు, అధికారులు ఈ విచారణలో ఆయన కాంటాక్ట్స్‌ను ధృవీకరిస్తున్నారని, ఇది కేవలం సాధారణ దర్యాప్తు ప్రక్రియ మాత్రమే అని తెలిపారు. ఈ కేసు దేశవ్యాప్తంగా అక్రమ బెట్టింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి అంశాలపై చర్చలకు దారితీస్తోంది.

Next Story