ప్రధాని మోడీని కలిసిన నాగార్జున ఫ్యామిలీ

by Ajay Maddhiboyina |

తన తండ్రి వారసత్వాన్ని గౌరవించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా, సమాజం కోసం ఏఎన్ఆర్ చేసిన కృషిని మోడీ అభినందించారు.

ప్రధాని మోడీని కలిసిన నాగార్జున ఫ్యామిలీ
X

- ఏఎన్ఆర్ బుక్‌ బహుమతి

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీని టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున తన ఫ్యామిలీ సమేతంగా కలిశారు. నంద్యాల ఎంపీ ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి నాగార్జున, భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, కోడలు శోభిత దూళ్లిపాల పార్లమెంట్‌లోని టీడీపీపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడే నాగార్జున కుటుంబాన్ని ప్రధాని మోడీ కలిసినట్లు ఎంపీ శబరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు పుస్తకాన్ని ప్రధాని మోడీకి అందజేశారు. ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించారు. ఈ సందర్భంగా తన తండ్రి వారసత్వాన్ని గౌరవించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా, సమాజం కోసం ఏఎన్ఆర్ చేసిన కృషిని మోడీ అభినందించారు. తెలుగు సినిమా ఇవ్వాళ ఇంత ఎత్తు ఎదగడంలో ఏఎన్ఆర్ పాత్ర కూడా ఉందని మోడీ తెలిపారు. ఏడు దశాబ్దాల సినిమా కెరీర్‌లో భారతీయ సాంప్రదాయాలు, విలువలను అక్కినేని తన సినిమాల్లో ప్రోత్సహించారని చెప్పారు. తెలుగు సినిమా రంగం చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి అక్కినేని కూడా కీలక పాత్ర పోషించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టుడియో, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఏ విధంగా సినిమా ఇండస్ట్రీకి సహాయపడుతుందో నాగార్జున వివరించారు. 117వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో నాగేశ్వరరావును గుర్తు చేసుకున్నందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story