Holi Molestation: వద్దంటున్నా అలా చేశాడు.. హోలీ వేడుకల్లో కో-స్టార్‌పై నటి ఆరోపణలు!

by Vennela |

Holi Molestation : ముంబైలోని హోలీ(Holi party) వేడుకలో టీవీ నటి, మద్యం మత్తులో ఉన్న తన సహనటుడి దాడికి గురైంది.

Holi Molestation: వద్దంటున్నా అలా చేశాడు.. హోలీ వేడుకల్లో కో-స్టార్‌పై నటి ఆరోపణలు!
X

దిశ, వెబ్‌డెస్క్: Holi Molestation : ముంబైలోని హోలీ(Holi party) వేడుకలో టీవీ నటి, మద్యం మత్తులో ఉన్న తన సహనటుడి దాడికి గురైంది. బలవంతంగా రంగులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది.

హోలీHoli party) అనేది భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఇది స్నేహభావాన్ని పెంపొందించే, అందరూ కలిసిమెలిసి ఆనందించాల్సిన వేడుక. అయితే, ఇటీవలి కాలంలో ఈ వేడుకను అసభ్య ప్రవర్తనకు, ముఖ్యంగా మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించేందుకు కొన్ని పురుషులు ఉపయోగిస్తున్నారు. హోలీ (Holi party) పేరుతో మహిళలను వేధించడం, బలవంతంగా రంగులు వేయడం, అసభ్యంగా ప్రవర్తించడం పెరుగుతున్నదనడానికి ముంబైలో జరిగిన తాజా ఘటన ఒక ఉదాహరణ.

ముంబై నగరంలోని జోగేశ్వరీలో ఇటీవల జరిగిన హోలీ(Holi party) వేడుకలో, టెలివిజన్ రంగానికి చెందిన ఒక ప్రముఖ నటి తన సహ నటుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. 29 ఏళ్ల ఈ నటి, తన సహ నటుడైన 30 ఏళ్ల వ్యక్తి వేడుకలో మద్యం మత్తులో తనతో పాటు ఇతర మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది.

తనను అతని నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, అతను ఆమెను నిరంతరం వెంబడిస్తూ, చివరకు బలవంతంగా ఆమె ముఖాన్ని పట్టుకుని రంగులు పూశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, అతను ఆమెను ప్రేమిస్తున్నానని, తనను ఎవరూ అడ్డుకోలేరని అసభ్యంగా వ్యాఖ్యానించాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనతో నటి భయపడిపోయి అక్కడి నుండి బయటకు వెళ్లి టాయిలెట్‌లోకి వెళ్లిపోయింది.

ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు చెప్పిన వెంటనే, వారు ఆ నటుడిని ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం చివరకు తగాదాకు దారితీసింది. అనంతరం నటి తన స్నేహితులతో కలిసి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును భారత న్యాయ వ్యవస్థలోని సెక్షన్ 75(1)(i) కింద నమోదు చేసి, నిందితుడికి నోటీసు పంపి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story