EC: సేమ్ నంబర్ ఓటర్ కార్డుల ఆరోపణలు.. మార్చి 31 వరకు రాష్ట్ర అధికారులకు ఈసీ డెడ్ లైన్

by Prasad Jukanti |   (  Updated:2025-03-04 11:40:42  IST  )

సేమ్ నెంబర్ ఓటర్ కార్డుల ఆరోపణల నేఫథ్యంలో రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది.

EC: సేమ్ నంబర్ ఓటర్ కార్డుల ఆరోపణలు.. మార్చి 31 వరకు రాష్ట్ర అధికారులకు ఈసీ డెడ్ లైన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేర్వేరు రాష్ట్రాల్లో ఓటర్లకు ఒకే నంబరు కలిగిన ఓటరు కార్డులు (Duplicate Epic Card Numbers) జారీ అవుతున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) రాష్ట్రాల్లోని ఎన్నికల యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరించాలని సూచించింది. సమస్యల వారీగా తీసుకున్న చర్యల నివేదికలను మార్చి 31లోగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ (Gyaneshwar Kumar) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి సమావేశం అయింది. ఈ సమావేశంలో మాట్లాడిన జ్ఞానేశ్ కుమార్ కుమార్.. పారదర్శకంగా ఉండాలని, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ప్రకారం పని చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కాగా, అనేక ఓటర్ గుర్తింపు కార్డులకు ఒకే సంఖ్య ఇవ్వడాన్ని టీఎంసీ (టీఎంసీ) ఎపిక్ స్కామ్ గా అభివర్ణించింది. ఈ వ్యవహారంలో ఈసీ స్పందనపై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తతంగంపై ఈసీ తన తప్పును 24 గంటల్లోగా ఒప్పుకోవాలని లేదంటే ఇందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను మంగళవారం బయటపెడతామని ఆ పార్టీ రాజ్యసభా పక్ష నాయకుడు డెరెక్ ఓబ్రియెన్ హెచ్చరించారు. టీఎంసీ ఆరోపణలపై ఇప్పటికే స్పందించిన ఈసీ.. ఎపిక్ నంబర్ ఓకేలా ఉన్నా మిగతా వివరాలు వేరుగా ఉన్నాయని బదులిచ్చింది. ఈసీ ఇచ్చిన ఈ సమాధానంపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Next Story