Accident: స్కూల్ బస్సు బోల్తా పడి ముగ్గురు విద్యార్థినులు మృతి.. రాజస్థాన్‌లో ఘటన

by vinod kumar |
Accident: స్కూల్ బస్సు బోల్తా పడి ముగ్గురు విద్యార్థినులు మృతి.. రాజస్థాన్‌లో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌ (Rajasthan)లోని రాజ్‌సమంద్(Raj samandh) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు బోల్తా పడి ముగ్గురు పాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మంది గాయపడ్డారు. అమెట్‌లోని మహాత్మా గాంధీ స్కూల్ విద్యార్థులు బస్‌లో పిక్నిక్ కోసం పాలి, దేసూరిలోని పరశురామ్ మహాదేవ్ ఆలయానికి వెళ్తుండగా దేసూరి నాల్ సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్టు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి మనీష్ త్రిపాఠి తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 25 మంది చిన్నారులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మరణించిన చిన్నారులను లలిత (14), ఆర్తి (12), ప్రీతి (11)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది పిల్లలు, ఆరుగురు టీచర్లు ఉన్నట్టు తెలిపారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం భజన్‌లాల్ శర్మ (Bajanlal sharma), గవర్నర్ హరిభౌ బగాడేలు సంతాపం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed