ట్రయల్ రన్ లోనే ప్రమాదం.. తప్పిన భారీ ముప్పు

by Muthe.Rajitha |

ట్రయల్ రన్స్ లో ఉండగానే ట్రైన్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది.

ట్రయల్ రన్ లోనే ప్రమాదం.. తప్పిన భారీ ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : ట్రయల్ రన్స్ లో ఉండగానే ట్రైన్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే లక్కీగా ట్రైన్ లో ఎవరూ లేకపోవడంతో భారీ ముప్పు తప్పింది. ముంబైలో మోనో రైలు ట్రయల్ రన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొత్త మోనో రైల్ రేక్ మీద సిగ్నలింగ్, స్విచ్ ఓవర్ పరీక్షలు జరుపుతుండగా.. రైలు ఒక బీమ్ నుంచి మరో బీమ్ మీదకు మారుతుండగా వంగిపోయింది. అందులో ఎవరు ప్రయాణికులు లేరు గాని, ఇద్దరు సిబ్బంది ఉండగా.. వారిని క్షేమంగా బయటికి తీసుకు వచ్చారు. ముంబైలో 2014 నుంచి మోనో రైళ్లు ప్రారంభం కాగా.. రైళ్ల అప్ గ్రేడ్ కోసం ఇటీవల మోనో రైళ్ల వ్యవస్థను షట్ డౌన్ చేసారు.

Next Story