- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Accident: బస్సు లోయలో పడి 51 మంది మృతి.. గ్వాటెమాలాలో ఘోర ప్రమాదం
by vinod kumar |

X
దిశ, నేషనల్ బ్యూరో: మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలా (Guatemala)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడి 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 70 మంది ప్రయాణికులతో కూడిన బస్సు శాన్ అగస్టీన్ పట్టణం నుంచి గ్వాటెమాల నగరానికి వస్తుండగా అదుపుతప్పి నగరానికి సమీపంలోని 65 అడుగుల లోతున్న లోయలో పడిపోయినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల నుంచి 51 మంది మృతదేహాలను వెలికితీసినట్టు తెలిపారు. ఈ ఘటనపై గ్వాటెమాల అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో స్పందించారు. విషాదంపై తీవ్రం సంతాపం తెలిపారు. గ్వాటెమాల దేశానికి ఎంతో బాధాకరమైన రోజని అభివర్ణించారు. రెండు రోజుల పాటు జాతీయ సంతాపదినాలు ప్రకటించారు.
Next Story