లేఆఫ్‌ల వేళ.. 50 వేల మంది ఉద్యోగులకు యాక్సెంచర్ గుడ్‌న్యూస్

by Naga Rani Yarlagadda |

గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft) వంటి టెక్ దిగ్గజాలు ఉద్యోగులకు లేఆఫ్ లు ఇస్తున్న వేళ.. ప్రముఖ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ (Accenture Promotions) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

లేఆఫ్‌ల వేళ.. 50 వేల మంది ఉద్యోగులకు యాక్సెంచర్ గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft) వంటి టెక్ దిగ్గజాలు ఉద్యోగులకు లేఆఫ్ లు ఇస్తున్న వేళ.. ప్రముఖ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ (Accenture Promotions) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 50 వేల మందికి ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీరిలో ఇండియాలో 15 వేల మందికి ప్రమోషన్లు దక్కనున్నాయి. యూరప్ లో 11 వేలు, పశ్చిమాసియా, ఆఫ్రికాలో 11 వేలు, అమెరికాలో 10 వేల మంది చొప్పున ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తమ ఉద్యోగులకు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యాక్సెంచర్ లో 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జూన్ లో వీరిలో 6 శాతం మంది ప్రమోషన్లు అందుకోనున్నారు. అలాగే కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారికి బేసిక్ పే పెరగనుంది. ఉద్యోగుల బోనస్, పనితీరు ఆధారిత ఈక్విటీపై డిసెంబర్లో నిర్ణయం తీసుకోనున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. కాగా.. 2023లో ఐటీ సేవలకు డిమాండ్ తగ్గడంతో 19 వేల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించిన విషయం తెలిసిందే.

Next Story