- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన పోలీస్ ఇన్‌స్పెక్టర్
ఎఫ్ఐఆర్ నుంచి పేరును తొలగించేందుకు కోటి లంచం అడిగిన పోలీస్ ఇన్‌స్పెక్టర్, అతని అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఢిల్లీ మారిస్ నగర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ జైన్.. సోనిపట్‌కు చెందిన

దిశ, వెబ్ డెస్క్ : ఎఫ్ఐఆర్ నుంచి పేరును తొలగించేందుకు కోటి లంచం అడిగిన పోలీస్ ఇన్‌స్పెక్టర్, అతని అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఢిల్లీ మారిస్ నగర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ జైన్.. సోనిపట్‌కు చెందిన ఫిర్యాదు దారుని పేరు కేసు నుంచి రిమూవ్ చేసేందుకు, ఎఫ్ఐఆర్ నుంచి ఓ సెక్షన్‌ను తొలగించేందుకు కోటి రూపాయాలు అడిగాడు. కానీ పలు చర్చల తర్వాత రూ. 70లక్షలకు ఒప్పుకున్నాడు.
ఈ క్రమంలోనే ఆగస్టు 2న తన సహచరుడికి రూ. 30లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ ఆఫీసర్స్. సోనిపట్ జీ3 స్కూల్ దగ్గర స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఏసీబీ.. అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు ఏసీబీకి సమాచారం అందించడంతో ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇక ఇద్దరు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచిన అధికారులు.. ఒక్కరోజు కస్టడీలోకి తీసుకున్నారు.






