- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh Mela : అభినవ శ్రవణుడు..ఎండ్ల బండిపై మహా కుంభమేళాకు తల్లి
జన్మనిచ్చిన అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి తన మరణం వరకు కూడా కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడి(Shrvan Kumar) కథ రామాయణం తెలిసిన వారందరికి సుపరిచతమే.

దిశ, వెబ్ డెస్క్ : జన్మనిచ్చిన అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి తన మరణం వరకు కూడా కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడి(Shrvan Kumar) కథ రామాయణం తెలిసిన వారందరికి సుపరిచతమే. శ్రవణ కుమారుడి కథ హిందూ పురాణమైన రామాయణంలో ఒక ఉదాత్తమైన పాత్ర. తల్లిదండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వానికి శ్రవణ్ కుమార్ కథ ఆదర్శనీయం.
శ్రవణ కుమారుడి కథ నుంచి స్ఫూర్తి పొందాడేమో కాని..జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే మహాకుంభ మేళా(Maha Kumbh Mela)కు తన తల్లి(Mother)ని తీసుకెళ్లేందుకు ఓ కొడుకు(A Son)అభినవ శ్రవణుడి(Abhinava Shrvan Kumar)గా మారాడు. ఎద్దుల బండి(Bullock Cart)పై తన తల్లి(Mother)ని కూర్చో బెట్టుకుని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళకు బయలుదేరాడు. అతని సంకల్పం సాహసం సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. మహాకుంభమేళాకు తన తల్లిని తీసుకెళ్లేందుకు ఆ కొడుకు చేసిన సాహసానికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
యూపీలోని ముజఫర్ నగర్‌కు చెందిన 65ఏళ్ల మాలిక్(Malik)... తన 92 ఏళ్ల తల్లి జబ్బీర్ దేవి(Mother Jabbir Devi)ని ఎద్దుల బండిపై కూర్చోబెట్టి లాగుతూ తను నడుచుకుంటూ కుంభమేళాకు తీసుకెళ్తున్నాడు. రోజూ 50కిలో మీటర్ల(Every day 50Kms)చొప్పున 13 రోజుల్లో త్రివేణి సంగమానికి చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
మహాకుంభ మేళలో పుణ్య స్నానాలు ఆచరించి తరించాలన్న సంకల్పంతో మాలిక్ తల్లి జబ్బీర్ దేవి మాదిరిగానే కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. అందుకే ప్రయాగ్ రాజ్ కుంభమేళ సనాతన ధర్మానికి..హిందూ మత విశ్వాసాలకు వేదికై ప్రపంచంలోనే అతి పెద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమంగా రికార్డు పుటలకెక్కింది.






