Saurabh Bhardwaj: మిస్ట‌ర్ చద్దా.. ఆప్ వల్లే నీకు పెళ్లయింది !

by velandi.Saikiran |

మిస్ట‌ర్ చడ్ఢా.. ఆప్ వల్లే నీకు పెళ్లయిందని అంటూ రాజ్య‌స‌భ స‌భ్యులు సౌర‌బ్ భ‌ర‌ద్వాజ్ పేర్కొన్నారు.

Saurabh Bhardwaj: మిస్ట‌ర్ చద్దా.. ఆప్ వల్లే నీకు పెళ్లయింది !
X

దిశ‌, వెబ్ డెస్క్: భారతీయ జనతా పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దాపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా అతని ఫాలోవర్స్ క్రమ క్రమంగా తగ్గిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎంపీ రాఘవ్ చద్దాపై ఆఫ్ నేత సౌరభ్ భరద్వాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంగా భారతీయ జనతా పార్టీ సర్కార్ తో కలిసి, రాఘవ్ చద్దా కుట్ర పన్నాడని ఆరోపణలు చేశారు.

ఇమేజ్ కోసం రాఘవ్ చద్దా డ్రామాలు

మధ్య తరగతి ప్రజల సమస్యలపై ప్రస్తావించే నాయకుడిగా ఇమేజ్ బిల్డ‌ప్‌ చేసు కోవడం కూడా అందులో భాగమేనని కౌంటర్ ఇచ్చారు. ఆప్ ఓ నిర్ణయం తీసుకొని.. రాజ్యసభ ఎంపీని చేయడం వల్లే రాఘవ్ చద్దాకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఆ హోదా కారణంగా అతనికి పెళ్లయిందని కూడా చురకలు అంటించారు. లేకపోతే రాఘవ్ చద్దాను ఎవ‌రూ పట్టించుకునే వారు కాదని కామెంట్ చేశారు సౌరభ్ భరద్వాజ్.

Next Story