ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీ రగడ

by Disha Web Desk 16 |
ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీ రగడ
X

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదం మరోసారి రచ్చకెక్కింది. విద్యుత్ సబ్సిడీ విషయంలో పరస్పర ఆరోపణలతో రాజకీయ ప్రకంపనలు రేపాయి. విద్యుత్ సబ్సిడీ ఫైల్ పై ఎల్జీ సంతకం పెట్టకుండా ఆలస్యం చేస్తున్నారని ఆప్ నేతలు విమర్శలకు దిగగా, కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎల్జీ కౌంటర్ ఇచ్చారు. కాగా శుక్రవారం ఉదయం విద్యుత్ శాఖ మంత్రి అతిషి మర్లేనా మాట్లాడుతూ.. ‘నేటితో(శుక్రవారం) దేశ రాజధానిలో 46 లక్షల మంది సబ్సిడీ కొల్పోతారు. ఈ సబ్సిడీని పొడగించే ఫైల్‌ను ఎల్జీ ఇంకా ఆమోదించలేదు. సబ్సిడీ లేకపోతే ప్రజలు పెరిగిన బిల్లులతో ఇబ్బందులు పడతారు’ అని అన్నారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని.. ఈ ఆరోపణలన్ని ఆధార రహితమని ఎల్జీ కార్యాలయం కొట్టి పారేసింది. కావాలనే డ్రామా చేస్తున్నారని, ఎల్జీ ఫైల్‌కు ఆమోదం తెలిపారని వెల్లడించింది. కాగా, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచిత కరెంట్ అందిస్తుంది. దీంతోపాటు 201 నుంచి 400 యూనిట్ల లోపు వినియోగానికి 50 శాతం సబ్సిడీని ఇస్తుంది.


Next Story

Most Viewed