ఆప్ నేత ఇంత తీవ్ర విషాదం.. కెనడాలో అనుమానాస్పద స్థితిలో కుమార్తె మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-29 04:46:43  IST  )

కెనడా (Canada)‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

ఆప్ నేత ఇంత తీవ్ర విషాదం.. కెనడాలో అనుమానాస్పద స్థితిలో కుమార్తె మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కెనడా (Canada)‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్‌ (Punjab)లోని డేరా‌బస్సీ (Derabassi)కి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత దేవిందర్ సింగ్ సైనీ (Davinder Singh Saini) 21 ఏళ్ల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మేరకు వంశిక సైనీ (Vamshika Saini) మృతదేహాన్ని పోలీసులు ఒట్టావా బీచ్ (Ottawa Beach) సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.

అయితే, రెండేళ్ల క్రితం ఉన్నత చదవులు నిమిత్తం కెనడాకు వెళ్లిన వంశిక ఏప్రిల్ 22న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి గత నాలుగు రోజుల కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె స్నేహితులు వంశిక కనిపించడం లేదంటూ ఏప్రిల్ 25న కటుంబ సభ్యులకు సమాచారం అంజేశారు. దీంతో తండ్రి దేవిందర్ సింగ్ సైనీ (Davinder Singh Saini) స్థానిక ఆప్ ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ (MLA Kuljit Singh) సహకారంతో తన కూతురు తప్పిపోయిందంటూ ఒట్టవాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేయగా.. ఇవాళ ఒట్టావా బీజ్ సమీపంలో వంశిక డేడ్‌బాడీ లభ్యమైంది.

Next Story