- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాపై వంద శాతం సుంకాలు వేయండి.. ఎందుకు తలొగ్గుతున్నారు?
అమెరికాపై వంద శాతం సుంకాలు వేయండి..ఎందుకు తలొగ్గుతున్నారు? అంటూ కేంద్రంపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా సుంకాలకు ప్రధాని మోడీ తలవంచుతున్నారని, మనం కూడా మిగతా దేశాల్లా యూఎస్‌పై ప్రతీకార సుంకాలు వేయాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. యూఎస్ మనపై 50 శాతం సుంకాలు వేస్తుంటే.. మనం తిరిగి వంద శాతం సుంకాలు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘అమెరికా ఒత్తిడికి కేంద్ర ఎందుకు తలవంచింది? ఇలా భారీ సుంకాలు వేసినప్పుడు మిగతా దేశాలు తలవంచలేదే. మనం కూడా అలాగే చేయాలి. యూఎస్ 50 శాతం సుంకాలు వేస్తే.. మనం వంద శాతం సుంకాలు వేయాలి. అలా చేస్తే దేశమంతా ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తుంది. మనది 140 కోట్ల మంది ప్రజలున్న దేశం. ఎవరూ మనల్ని అవమానించలేరు’ అని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. యూఎస్ నుంచి వచ్చే పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని భారత్ రద్దు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది కచ్చితంగా స్వదేశీ రైతులకు అన్యాయం చేసినట్లేనని అన్నారు.
Next Story






