- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ డిప్యూటీ మేయర్ గా ఆలే మహ్మద్ ఇక్బాల్
by Javid Pasha |
ఇప్పటికే ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న ఆప్.. డిప్యూటీ మేయర్ పదవిని కూడా తన ఖాతాలో వేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న ఆప్.. డిప్యూటీ మేయర్ పదవిని కూడా తన ఖాతాలో వేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో మొత్తం 265 ఓట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆలే మహ్మద్ ఇక్బాల్‌కు 147 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కమల్ బగ్రీకి 116 ఓట్లు వచ్చాయి. 2 ఓట్లు చెల్లకుండా పోయాయి. అత్యధిక ఓట్లు సాధించిన ఆలే మహ్మద్ ఢిల్లీ డిప్యూటీ మేయర్ గా పదవిని చేపట్టనున్నారు. అంతకు ముందు ఢిల్లీ మేయర్ గా ఆప్ కు చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికైంది. మేయర్ ఎన్నికలో షెల్లీకి 150 ఓట్లు రాగా బీజేపీకి చెందిన రేఖా గుప్తకు 116 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మున్సిపల్ మేయర్ పీఠాన్ని అధిరోహించనుంది.
Next Story






