Aakash: ‘ఆకాశ్’ క్షిపణి వ్యవస్థపై బ్రెజిల్ ఆసక్తి.. త్వరలోనే ఒప్పందం జరిగే చాన్స్ !

by B.Srinivas |

ఆపరేషన్ సిందూర్ టైంలో భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

Aakash: ‘ఆకాశ్’ క్షిపణి వ్యవస్థపై బ్రెజిల్ ఆసక్తి.. త్వరలోనే ఒప్పందం జరిగే చాన్స్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ టైంలో భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. డీఆర్డీఓ తయారు చేసిన ఈ మిస్సైల్ ఎంతో అద్బుతంగా తన పనితీరును కనబర్చింది. ఈ క్రమంలోనే ఆకాశ్ వైమాణిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ ఆసక్తి కనబరుస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒప్పందం సైతం జరగనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. బ్రిక్స్ సదస్సు నిమిత్తం ప్రధాని మోడీ ఈ నెల 5 నుంచి 8 వరకు బ్రెజిల్‌లో పర్యటిస్తారు. ఈ సమయంలో రెండు దేశాల మధ్య ఒక కీలక రక్షణ ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉన్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కుమరన్ తెలిపారు. బ్రెజిల్ ప్రభుత్వం ఆకాశ్ క్షిపని వ్యవస్థ, తీర నిఘా వ్యవస్థ, గరుడ ఫిరంగి వ్యవస్థపై కూడా ఆసక్తి కలిగి ఉందని పేర్కొన్నారు. ‘ఆకాశ్’ను బ్రెజిల్ కొనుగోలు చేస్తే, అది భారతదేశ రక్షణ సాంకేతిక పరిజ్ఞాన ఎగుమతిలో ఒక కొత్త మైలురాయి అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారత రక్షణ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు సైతం దక్కుతుందని అంచనా వేస్తున్నారు.

ఆకాశ్ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. ఇది మీడియం-రేంజ్ మొబైల్ సర్ఫేస్-టూ-ఎయిర్ క్షిపణి. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, డ్రోన్‌లు, క్రూయిజ్ క్షిపణులు, ఎయిర్-టు-సర్ఫేస్ క్షిపణులు వంటి గగనతల ముప్పులను అడ్డుకోవడమే లక్ష్యంగా రూపొందించారు. 25 కిలోమీటర్ల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. గగన తలంలోని డ్రోన్లను ధ్వంసం చేయగలదు. పాక్ తో యుద్ధం సమయంలో ఇది కీలక పాత్ర పోషించింది. పాక్ డ్రోన్లను, క్షిపణులనున విజయవంతంగా తిప్పి కొట్టింది. ఈ నేపథ్యంలోనే బ్రెజిల్ దీనిపై ఆసక్తి చూపుతోంది.

బ్రహ్మోస్‌పై ప్రతి స్పందించడానికి 30 నుంచి 45 సెకన్లే పట్టింది: పాక్

ఆపరేషన్ సిందూర్‌పై పాక్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావూల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఘర్షణ సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణిలో అణ్వాయుధాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి తమ సైన్యానికి 30-45 సెకన్లే పట్టిందని తెలిపారు. రావల్పిండిలోని చక్లాలా ప్రాంతంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించిందని, దాని స్వభావాన్ని అంచనా వేయడానికి కొన్ని సెకన్ల సమయం మాత్రమే ఉందని చెప్పారు. దీనిపై కేవలం 30 సెకన్లలోపు ఏదైనా నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితో అర్థం చేసుకోవచ్చన్నారు. భారత్ అణ్వస్త్రాలను ఉపయోగించపోవచ్చని, కానీ ఆ టైంలో పాక్ తప్పుగా అర్థం చేసుకుంటే అణు ఘర్షణకు దారి తీసే పరిణామాలు జరిగేవని తెలిపారు.

Next Story