- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
134 కోట్ల మంది ఆధార్ వివరాలు సేఫ్ : కేంద్ర ప్రభుత్వం
దేశంలోని 134 కోట్ల మంది ఆధార వివరాలు సేఫ్ గా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని 134 కోట్ల మంది ఆధార వివరాలు సేఫ్ గా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం తెలిపారు. UIDAI డేటాబేస్ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల సమాచారం ఎలాంటి దుర్వినియోగానికి గురికాలేదని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌లో సుమారు 134 కోట్ల మంది నమోదు చేసుకున్నారని, ఇప్పటివరకు 16 వేల కోట్లకు పైగా అథంటికేషన్ లావాదేవీలు జరిగాయని తెలిపారు.
ఆధార్ డేటా భద్రత కోసం UIDAI మల్టీ లెవెల్ "డిఫెన్స్ ఇన్ డెప్త్" విధానాన్ని అమలు చేస్తోందని వెల్లడించారు. డేటా ట్రాన్స్ఫర్, స్టోరేజి సమయంలో ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ పర్యవేక్షణతో పాటు స్వతంత్ర ఆడిట్ ఏజెన్సీలు కూడా ఆధార్ వ్యవస్థను నిరంతరం పరిశీలిస్తున్నాయని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు.






