- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aadhaar: ఆధార్ కార్డుల దుర్వినియోగానికి చెక్.. మై ఆధార్ పోర్టల్‌లో కొత్త ఫీచర్
by B.Srinivas |
మరణించిన వారి ఆధార్ కార్డులను బ్లాక్ చేసేందుకు ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోర్టల్‌లో కొత్త సదుపాయాన్నితీసుకొచ్చింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: మరణించిన వారి ఆధార్ కార్డులను బ్లాక్ చేసేందుకు ఉడాయ్ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మై ఆధార్ పోర్టల్ (My aadhaar portal) లో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో ఏ వ్యక్తి అయినా తన కుటుంబంలోని సభ్యుడి మరణం గురించి సమాచారం ఇవ్వొచ్చు. మై ఆధార్ పోర్టల్ ద్వారా కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి వివరాలు అందజేయొచ్చు. దీని కోసం ఆధార్ కార్డు వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రం నంబర్ వంటి అవసరమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. సబ్సిడీలను క్లెయిమ్ చేయడం, బ్యాంకు ఖాతాలు ఓపెన్, ప్రభుత్వం నుంచి ఏవైనా ఇతర ప్రయోజనాలను పొందడం వంటి కార్యకలాపాల కోసం మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్‌ను మోసపూరితంగా ఉపయోగించడాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.
Next Story






