- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ కాదు : యూపీ
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగానికి సంబంధించిన ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగానికి సంబంధించిన ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీనే బర్త్ సర్టిఫికేట్‌కు బదులుగా ఉపయోగించే వారని, ఇకపై ఆధార్ కార్డు మాత్రమే జనన ధ్రువీకరణ కాదని తేల్చి చెప్పింది. అనగా ఆధార్ కార్డు జారీ చేసే సమయంలో జనన ధ్రువీకరణ పత్రాన్ని అడిగేవారు కాదు. అలాగే ఆధార్‌లో ఉన్న పుట్టిన తేదీ పూర్తిగా వ్యక్తి ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఉండేది. అందువల్ల అది నిజమైన జనన ధ్రువీకరణ కాకపోవడానికి కూడా అవకాశం ఉండేది.
ఈ నేపథ్యంలో ప్లానింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఇకపై ఎప్పుడూ, ఏ శాఖలోనూ ఆధార్ కార్డును పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా బర్త్ సర్టిఫికేట్‌గా అంగీకరించకూడదని స్పష్టం చేసారు. పుట్టిన తేదీ నిర్ధారణ కోసం ఆధార్ కార్డు కాకుండా తప్పనిసరిగా నిజమైన బర్త్ సర్టిఫికేట్‌ను మాత్రమే పరిగణించాలని అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసారు. దీని వల్ల భవిష్యత్తులో రికార్డుల్లోని సమాచారంపై గందరగోళం తగ్గుతుందని అలాగే తప్పుడు పుట్టిన తేదీ వివరాలు ఇవ్వడం కూడా నియంత్రించబడుతుందని అమిత్ సింగ్ బన్సాల్ అభిప్రాయపడ్డారు.






