‘రాహుల్‌ జీ.. నేనూ మీలాగే పెళ్లి చేసుకోను’ విపక్ష నేతతో ఓ యువతి చేసిన ప్రతిజ్ఞ.. వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-06-08 14:46:37  IST  )

‘రాహుల్ జీ నేను కూడా మీలాగే పెళ్లి చేసుకోను’ అంటూ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఓ యువతి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

‘రాహుల్‌ జీ.. నేనూ మీలాగే పెళ్లి చేసుకోను’ విపక్ష నేతతో ఓ యువతి చేసిన ప్రతిజ్ఞ.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘రాహుల్ జీ నేను కూడా మీలాగే పెళ్లి చేసుకోను’ అంటూ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఓ యువతి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. బీహార్ పర్యటనలో భాగంగా గయాలో మహిళా సంవాద్ కార్యక్రమానికి రాహుల్‌ హాజరయ్యారు. అందులో భాగంగా మహిళలతో రాహుల్ గాంధీ సంభాషించారు. ఈ సందర్భంగా రియా పాస్వాన్ (Riya Paswan) అనే యువతి స్టేజ్ పైకి వచ్చి (Rahul Gandhi) రాహుల్ గాంధీతో జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. మీ వల్లే రాజకీయాల్లోకి వచ్చాను.. మీరే ప్రేరణగా నిలిచారని యువతి చెప్పింది. ప్రజల సమస్యలపై తాను పని చేయాల్సి ఉందని, మహిళలు కూడా రాజకీయాల్లో రాణించాలన్నదే తన ఆశయమని పేర్కొంది.

విద్య వంటి రంగాల్లో మార్పులకు రాజకీయాలే పునాది అని యువతి తెలిపింది. కానీ మహిళా ప్రాతినిధ్యం, ముఖ్యంగా అణగారిన వర్గాల నుంచి లోపం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. యువతి ఇచ్చిన ప్రసంగానికి రాహుల్‌తో సహా అందరూ మంత్రి ముగ్ధులయ్యారు. రియా పాస్వాన్ మాటలకు రాహుల్ గాంధీ ఫిదా అయ్యారు. నువ్వు మంచి ప్రసంగాలు ఇస్తావు.. అంటూ చివరికి రాహుల్ యువతిని అభినందించారు.

ఇంతకి ఆ యువతి ఎవరంటే?

నీలాగే, నేను కూడా పెళ్లి చేసుకోను.. అని యువతి చెప్పినప్పుడు కార్యక్రమంలో ఉన్న వారు నవ్వులు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, యువతి రియా పాస్వాన్ జాతీయ స్థాయిలో ఇది వరకే గుర్తింపు లభించింది. 2022లో ఒక బహిరంగ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్‌తో జరిగిన సమావేశంలో రియా పాస్వాన్ జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందింది. ప్రభుత్వం ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లను ఎందుకు అందించలేదో ప్రశ్నించింది. దీంతో యువతికి ‘ప్యాడ్ గర్ల్’ (Pad Girl) అనే పేరు సైతం వచ్చింది.

Next Story