- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Whale Attack : తిమింగలం నోట చిక్కి...ప్రాణాలతో యువకుడు!
భూమి మీద నూకలుంటే...తల రాత సక్కగా ఉంటే..అదృష్టం తోడుంటే ఎన్ని ప్రాణగండాలైన అధిగమించవచ్చన్న సామెత ఓ యువకుడి జీవితంలో రుజువైంది.

దిశ, వెబ్ డెస్క్ : భూమి మీద నూకలుంటే...తల రాత సక్కగా ఉంటే..అదృష్టం తోడుంటే ఎన్ని ప్రాణగండాలైన అధిగమించవచ్చన్న సామెత ఓ యువకుడి జీవితంలో రుజువైంది. నడి సముద్రంలో ఏకంగా తిమింగలం నోట చిక్కి ప్రాణాలతో బయటపడిన ఆ యువకుడి అదృష్టం అతడిని సజీవంగా నిలిపింది. సినిమాల్లో హీరోల సాహస ఘట్టాలలో మాత్రమే కనిపించే దృశ్యం ఓ యువకుడికి ఎదురైంది.
తిమింగలం మింగేసిన వ్యక్తి మళ్లీ బయటకు వస్తాడా? అంటే ఛత్రపతి సినిమాలో ప్రభాస్ మాత్రం అలా వస్తాడు మరి. తిమింగలం తనపై దాడి చేస్తే దాని పొగరును అణిచి మరీ ప్రభాస్ పడవ మీదకు వచ్చేస్తాడు. దేవర సినిమాలో ఎన్టీఆర్ సైతం షార్క్ పై విజయం సాధించి దాన్ని బంధించి తెస్తాడు. హలీవుడ్ సినిమాల్లో ఇలాంటి సాహస దృశ్యాలు కోకొల్లలు. నిజజీవితంలో మాత్రం తిమింగలం బారినపడితే బతికి మళ్లీ బట్టకట్టడం సాధ్యమేనా అంటే ఓ యువకుడికి ఎదురైన ఘటన అతడిని మృత్యుంజయుడిని చేసింది.
చిలీ సముద్ర జలాల్లో ఓ చిన్న పడవతో వెళ్లిన ఓ యువకుడిని హంప్ బ్యాక్ తిమింగం నోట కరిచి ఎటువంటి హాని చేయకుండా వదిలేసిన ఘటన పటగోనియా తీరానికి సమీపంలో జరిగింది. అండ్రియన్ సిమనికాస్(24) అనే యువకుడు తన తండ్రి డెల్ తో కలిసి చెరొక చిన్న పడవ(కయాక్ ) లలో సముద్రంలోకి వెళ్లారు. కయాక్ అంటే ఒక చిన్న పడవలాంటిది. ఇది డబుల్ బ్లేడెడ్ తెడ్డుతో ముందుకు వెళ్తుంది. అందులో ప్రయాణించేవారిని కయాకర్ అంటారు. ఆడ్రియన్‌కు కయాకర్‌గా సముద్రంలో విహరించడం అంటే ఇష్టం. ఇదే సరదా అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.
సముద్రంలోకి వెళ్లిన అడ్రియన్ కు అనుహ్యంగా ఓ భారీ తిమింగలం ఎదురుపడింది. అది ఆండ్రియన్ తో పాటు పసుపు రంగులో ఉన్న అతడి పడవను నోట కరచి మింగేందుకు ప్రయత్నించింది. కొద్ధి క్షణాల్లోనే మనసు మార్చుకున్న తిమింగలం పడవతో పాటు ఆ యువకుడిని వదిలేసింది. ఆడ్రియన్‌ను బయటకు ఉమ్మి వేసింది. బోటుతో పాటు అతడు నీటిపైకి రావడంతో తండ్రి డేల్ ఊపిరి పీల్చుకున్నాడు. కుమారుడికి ధైర్యం చెప్పి, అతడిని ఒడ్డుకు చేర్చాడు.
ఇదంతా తన కుమారుడికి కొన్ని గజాల దూరంలో ఉన్న తండ్రి డెల్ వీడియోలో బంధిస్తూ ..అలాగే ఉండు..అలాగే ఉండు అంటు కేకలు వేస్తు అప్రమత్తం చేశాడు. తిమింగలం పక్కకు వెళ్లిపోయాక వారిద్ధరు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. చిలీ సముద్ర జలాల్లో తిమింగలాలు మనుషులపై దాడి చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కాగా తిమింగలం నోటచిక్కి మృత్యుకుహారంలోకి వెళ్లి వచ్చినట్లైన అడ్రియన్ తనకు ఎదురైన భయానక ప్రాణపాయం అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. "తిమింగలం నన్ను మింగేస్తుంది. నా పనైపోయింది అనుకొన్నానంటూ" ఆ భయానక అనుభవాన్ని వివరించాడు.






