సినీ ఫక్కీలో సోదరిని ఎత్తుకెళ్లిన అన్న.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Satheesh |
సినీ ఫక్కీలో సోదరిని ఎత్తుకెళ్లిన అన్న.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్‌లో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. అచ్చం సినిమాలో మాదిరి తన సోదరి తమ ఇష్టానికి విరుద్దంగా ప్రేమ పెళ్లి చేసుకుందని అత్తింటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లాడు ఆమె సోదరుడు. ఈ ఘటన బిహార్ అరారియా జిల్లాలో చోటుచేసుకుంది. రూప, ఛోటు కుమార్ ఠాకూర్ గంతకొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడం వల్ల యువతి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులను ఎదురించి జూన్ 2న రూప, ఛోటు కుమార్‌ను వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహించిన యువతి సోదరుడు పెళ్లైన మరుసటి రోజే.. పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను తన అత్తారింట్లో నుంచి బలవంతంగా బయటకి లాక్కొచ్చాడు.

యువతి అత్తింట్లో పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆమె సోదరుడు వచ్చి బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె అత్తామామలు వారి కోడలిని విడిచిపెట్టాలని ఎంత బతిమాలినా వినకుండా.. వారిపై దాడి చేసి ఆమెను బైక్‌పై ఎత్తుకెళ్లాడు. దీంతో స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అచ్చం సినిమాలో సీన్‌లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.



Next Story