TS RTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి ఇక పండగే

by Disha Web Desk 1 |
TS RTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి ఇక పండగే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు రావడంతో మరో బంపర్ ఆఫర్‌కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారి కోసం ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో తీసుకొచ్చినట్లుగా టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. అదేవిధంగా బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం డిస్కౌంట్‌ను సంస్థ కల్పించింది. ఆ రాయితీ రిటర్న్ జర్నీకి కూడా వర్తిస్తుందని ఆర్టీస అధికారులు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్‌ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ http://tsrtconline.in ‌ను సంప్రదించండి’ అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయి.

Next Story

Most Viewed