- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్లాస్ జరుగుతుండగా గుండెపోటు.. బెంచ్ మీదే కుప్పకూలిన యువకుడు (వీడియో)
చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ఇటీవల దేశవ్యాప్తంగా పలువురు గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా క్లాస్ జరుగుతుండగా ఓ యువకుడు గుండెపోటు వచ్చి బెంచ్ మీదే కుప్పకూలి మరణించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ఇటీవల దేశవ్యాప్తంగా పలువురు గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా క్లాస్ జరుగుతుండగా ఓ యువకుడు గుండెపోటు వచ్చి బెంచ్ మీదే కుప్పకూలి మరణించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని భవార్‌కువాలో ఓ కొచింగ్ సెంటర్‌లో 18 ఏళ్ల రాజా అనే యువకుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే కోచింగ్ సెంటర్‌లో క్లాస్ వింటున్న సమయంలో ఒక్కసారిగా తాను కూర్చున్న బెంచ్‌పైనే పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్లాస్ జరుగుతుండగా గుండెపోటు.. బెంచ్ మీదే కుప్పకూలి యువకుడు మృతి
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2024
మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతోన్న రాజా లోధి అనే యువకుడు కోచింగ్ క్లాసులోనే కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు… pic.twitter.com/Gs0Mm5N4ek






