- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిజ్జా, డ్రింక్‌లో మత్తుమందు కలిపి రేప్.. కాలేజీ క్యాంపస్‌లోనే దారుణం
ఐఐఎం కలకత్తా జోకా క్యాంపస్‌లో రేప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది. మహిళను రెండవ సంవత్సరం విద్యార్థి పర్మానంద్ టోప్పౌన్వర్ బాయ్స్ హాస్టల్‌లోకి కౌన్సెలింగ్ సెషన్ పేరుతో ఆహ్వానించి.. పిజ్జా, డ్రింక్ ఇచ్చి మత్తుమందు కలిపి లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐఐఎం కలకత్తా జోకా క్యాంపస్‌లో రేప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది. మహిళను రెండవ సంవత్సరం విద్యార్థి పర్మానంద్ టోప్పౌన్వర్ బాయ్స్ హాస్టల్‌లోకి కౌన్సెలింగ్ సెషన్ పేరుతో ఆహ్వానించి.. పిజ్జా, డ్రింక్ ఇచ్చి మత్తుమందు కలిపి లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలుస్తోంది. బాధితురాలు స్పృహ కోల్పోయి.. మేల్కొన్న తర్వాత అత్యాచారానికి గురైనట్లు గుర్తించింది. నిందితుడు ఆమెను బెదిరించాడని.. హరిదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, సెక్యూరిటీ సిబ్బంది విచారణ జరుగుతోంది. బాధితురాలిని విజిటర్ రిజిస్టర్‌లో సంతకం చేయనివ్వకపోవడంతో క్యాంపస్ సెక్యూరిటీపై ప్రశ్నలు తలెత్తాయి.
అయితే బాధితురాలి తండ్రి అత్యాచార ఆరోపణలను ఖండించారు. ఆమె కారు నుంచి పడిపోయి స్పృహ కోల్పోయిందని.. మానసికంగా స్థిరంగా ఉందని చెప్పారు. దీంతో పోలీసులు ఈ అంశంపై కూడా విచారిస్తున్నారు. మెడికల్ టెస్ట్ ఫలితాలు రావాల్సి ఉండగా.. ఈ ఘటనతో రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






