కలెక్టరేట్‌లో మహిళా ఆత్మహత్యాయత్నం.. ఈడ్చుకెళ్లిన పోలీసులు

by Sujitha Rachapalli |

మధ్యప్రదేశ్ రాష్ట్రం దతియా కలెక్టరేట్‌లో గందరగోళం సృష్టించింది ఓ మహిళ. తన ఫిర్యాదును పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో పోలీసులు ఆమెను సముదాయించేందుకు బదులు ఈడ్చుకెళ్లారు.

కలెక్టరేట్‌లో మహిళా ఆత్మహత్యాయత్నం.. ఈడ్చుకెళ్లిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం దతియా కలెక్టరేట్‌లో గందరగోళం సృష్టించింది ఓ మహిళ. తన ఫిర్యాదును పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో పోలీసులు ఆమెను సముదాయించేందుకు బదులు ఈడ్చుకెళ్లారు. బరౌని మున్సిపాలిటీ ప్రాంతంలో తను ఫ్లాట్ కొనుగోలు చేశానని.. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఉన్నాయని తెలిపింది. కానీ మున్సిపాలిటీ అదే ప్లాట్‌ను మరో పేరుకు బదిలీ చేసిందని.. తనకు న్యాయం చేయాలని కోరింది. అయితే ఈ కేసు కోర్టులో ఉందని.. స్వయంగా కలెక్టర్ స్వప్నిల్ వాంఖడే వివరించారు. ఇప్పటికే ఈ కేసును నాలుగు సార్లు దర్యాప్తు చేశామని.. జాయింట్ కలెక్టర్‌తోసహా ఇతర అధికారులు స్థలాన్ని పరిశీలించారని స్పష్టం చేశారు. కేసు పెండింగ్‌లో ఉణ్నందునా.. పరిపాలనా జోక్యం సాధ్యం కాదని చెప్పారు.

Next Story