ఘోరం... మైనర్ బాలుడితో ఆన్‌లైన్ పరిచయం.. శృంగార కోరికలు తీర్చుకునేందుకు వాడుకున్న మహిళ..

by Sujitha Rachapalli |

సోషల్ మీడియా కారణంగా చిన్న వయసులోనే పిల్లలు చెడిపోతున్నారు. చూడకూడని కంటెంట్ చూస్తూ టీనేజ్‌లోనే పాడైపోతున్నారు. అయితే కొందరు దీన్ని గుడ్ పర్పస్‌కు ఉపయోగించుకుంటున్నా.. చాలా మంది బ్యాడ్ వేలో వెళ్తున్నారు.

ఘోరం... మైనర్ బాలుడితో ఆన్‌లైన్ పరిచయం.. శృంగార కోరికలు తీర్చుకునేందుకు వాడుకున్న మహిళ..
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా కారణంగా చిన్న వయసులోనే పిల్లలు చెడిపోతున్నారు. చూడకూడని కంటెంట్ చూస్తూ టీనేజ్‌లోనే పాడైపోతున్నారు. అయితే కొందరు దీన్ని గుడ్ పర్పస్‌కు ఉపయోగించుకుంటున్నా.. చాలా మంది బ్యాడ్ వేలో వెళ్తున్నారు. ఓ మైనర్ బాలుడు కూడా ఇలాగే చెడ్డదారిని ఎంచుకుని మోసపోయాడు. ఆన్‌లైన్ గేమ్‌తో ఆంటీతో జరిగిన పరిచయం రొమాంటిక్ రిలేషన్‌కు దారితీయగా.. ఇల్లు వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గీర్-చంపా జిల్లాలో ఓ మహిళ, మైనర్ బాలుడు ఫ్రీ ఫైర్ అనే ఆన్‌లైన్ గేమ్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. ఆకస్మికంగా అదృశ్యమయ్యారు. బాలుడి కుటుంబం ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు దర్యాప్తు చేసి వారిని జగదల్‌పూర్‌లో కనుగొన్నారు. విచారణలో మహిళ బాలుడిని ఆకర్షించి తనతో తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆమె కోసం వెళ్లేటప్పుడు నగదు, నగలు తీసుకెళ్లాడు బాలుడు. కాగా ఆమె బాలుడిని లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు వాడుకుందని తెలుస్తోంది. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. బాలుడిని అతని కుటుంబానికి అప్పగించారు.

Next Story