Intelligence warning: దేశంలో ఉగ్రదాడి జరగొచ్చు.. నిఘా వర్గాల హెచ్చరిక

by Prasad Jukanti |

తహవూర్ రాణా విచారణ నేపథ్యంలో దేశంలో ఉగ్రదాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

Intelligence warning: దేశంలో ఉగ్రదాడి జరగొచ్చు.. నిఘా వర్గాల హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: 26/11 ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవూర్ రాణాను (Tahawwur Rana) అమెరికా నుంచి భారత్ కు తీసుకువచ్చి విచారిస్తున్న నేపథ్యంలో దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు (Intelligence alert) హెచ్చరించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నదీమార్గాల్లో చొరబడి దాడులు చేయవచ్చని అప్రమత్తం చేశాయి. డ్రోన్, ఐఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ మేరకు రైల్వే శాఖ సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాయి.

కాగా 2008 నవంబర్ 26న పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్రమార్గం ద్వారానే ముంబయిలోకి ప్రవేశించి సీఎస్ఎంటీ, ఒబెరాయి ట్రైడెంట్, తాజ్ హోటల్ లో మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తహవూర్ రాణాను భారత్ ప్రస్తుతం విచారిస్తోంది. ఈ విచారణలో అతడు చెప్పబోయే సమచారం కీలకం కాబోతున్నది. ముఖ్యమంగా పాకిస్థాన్ కుట్రలు బయహిర్గతం అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇటువంటి తరుణంలో నిఘా వర్గాల నుంచి ఈ అలర్ట్ రావడం గమనార్హం.

Next Story