Maharashtra Train Accident : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం... 12 మంది మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-01-22 17:47:25  IST  )

మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర రైలు ప్రమాదం(Train accident) చోటు చేసుకుంది.

Maharashtra Train Accident : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం... 12 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర రైలు ప్రమాదం(Train accident) చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ ప్రెస్(Pushpak Express) రైల్లో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది అనే పుకారు వలన ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జలగావ్(Jalagav) జిల్లాలో జరిగిన ఈ ప్రమాద వివరాలిలా ఉన్నాయి.. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగి ఇతర బోగిలకు వ్యాపిస్తుండటంతో.. ప్రయాణికులు చైన్ లాగి హుటాహుటిన కిందకి దిగారు. అదేసమయంలో పక్క ట్రాక్ పై వెళ్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్(Karnataka Express) వారిమీది నుంచి దూసకు పోవడంతో అక్కడికక్కడే 12 మంది మరణించారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Next Story