Raod Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మంది సజీవ దహనం

by M.Rajitha |
Raod Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మంది సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర అమెరికా(South America)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ఉత్తర అమెరికాలోని మెక్సికో(Mexico) దేశంలో జరిగిన దారుణ ప్రమాదంలో 40 మంది అక్కడిక్కడే సజీవ సమాధి(Burned Live) అయ్యారు. ఈ ప్రమాద వివరాల్లోకి వెళితే.. దక్షిణ మెక్సికోలోని టబాస్క రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున.. 48 మందితో ప్రయాణిస్తున్న బస్సు ఓ ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టింది. వెంటనే బస్సులో ఆయిల్ ట్యాంక్ పేలి మంటలు అంటుకున్నాయి. మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించగా.. వారందిరికీ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ట్రక్కు డ్రైవర్, బస్సు డ్రైవర్ తో సహ 40 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన కొద్ది మంది మాత్రం గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే బస్సులో ఉన్నవారు కాలిపోయారు. అయితే ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను మాత్రమే అధికారులు గుర్తించగలిగారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల ప్రాథమిక కారణం అతివేగం అని గుర్తించిన పోలీసులు.. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed