- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: ఉత్సవాలకు వెళ్తున్న రెండు బస్సులు ఢీ కొనటంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37 మంది అక్కడిక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బొలీవియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లో వెళ్లితే..
బొలీవియాలో శనివారం ఉదయం 7 గంటలకు (బొలీవియా కాలమానం ప్రకారం) ఘోర రోడ్డు ప్రమాదం (Bolivia Bus Road Accident) జరిగింది. ఉయుని, కొల్చాని రహదారిపై వెళ్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ బస్సులో ఉన్న 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు, రెస్క్యూ బృందం వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని వారిని బయటకు తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. లాటిన్ అమెరికాలో అతి పెద్ద ఉత్సావాల్లో ఒకటైన 'ప్రఖాత ఒరురో కార్నివాల్'కు బస్సులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వారిని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రకి తరలించారు. చనిపోయిన వారిని గుర్తించి బాధిత కుటుంబాలకు అప్పగిస్తామని బొలీవియా అధికారులు పేర్కొన్నారు.






