దాయాది దేశానికి దిమ్మతిరిగే షాక్.. పాక్ ‘సెలెన్’ షిప్‌ను అడ్డుకున్న ఇరాన్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-25 10:56:59  IST  )

దాయాది పాకిస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది. హర్మూజ్ జలసంధి గుండా పాక్‌కు వెళ్తున్న ‘సెలెన్’ నౌకను ఇరాన్ దళాలు అడ్డుకుని వెనక్కి పంపాయి.

దాయాది దేశానికి దిమ్మతిరిగే షాక్.. పాక్ ‘సెలెన్’ షిప్‌ను అడ్డుకున్న ఇరాన్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి పాకిస్థాన్‌కు వెళ్తున్న ఓ కంటైనర్ నౌకను ఇరాన్ సైనిక దళాలు అడ్డుకున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకాదళం ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే, యూఏఈలోని షార్జా నుంచి ‘సెలెన్’ (SELEN) అనే కంటైనర్ నౌక పాకిస్థాన్‌లోని కరాచీ నౌకాశ్రయానికి బయలుదేరింది. అయితే, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఇరాన్ దళాలు ఈ నౌకను నిలిపివేశాయి. అంతర్జాతీయ సముద్ర నిబంధనలు పాటించలేదని, సరైన రవాణా అనుమతులు (Clearance) లేవని పేర్కొంటూ నౌకను తిరిగి వెనక్కి పంపేశాయి.

పాక్ మధ్యవర్తిత్వ యత్నాల వేళ..

ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఓ వైపు శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంటుంటే, మరోవైపు ఇరాన్ మాత్రం తమ నిబంధనల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగ ఘటనపై IRGC నౌకాదళ కమాండర్ అలిరెజా తంగ్సిరి స్పందిస్తూ.. చట్టపరమైన ప్రోటోకాల్స్ పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతులు లేకపోవడం వల్లే ‘సెలెన్’ నౌకను వెనక్కి తిప్పి పంపామనా స్పష్టం చేశారు.

Next Story