- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్.. మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ చేపట్టిన మధ్యవర్తిత్వ పాత్రను ఇరాన్ తిరస్కరించింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో నెలకొన్న ఉద్రిక్తతల వేల దాయాది పాకిస్థాన్ (Pakistan)కు ఊహించని షాక్ తగిలింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య రాజీ కుదిర్చేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అధికారికంగా తోసిపుచ్చింది. తమకు తెలియకుండానే పాక్ ఆ చర్చల వేదికలను ఏర్పాటు చేసుకుందని ఇరాన్ (Iran) విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే, పాకిస్థాన్ ఏర్పాటు చేసిన దౌత్య వేదికలు వారి సొంత నిర్ణయమని స్పష్టం చేశారు. ఆ చర్చల్లో ఇరాన్ ఎప్పుడూ భాగస్వామి కాలేదని.. అసలు తాము అందులో పాల్గొననే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా, ఇరాన్, అమెరికా (America) మధ్య పెరుగుతున్న ఘర్షణలను నివారించేందుకు పాక్ ఓ మధ్యవర్తిగా వ్యవహరించాలని భావించింది. అయితే దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి సానుకూలత రాకపోవడంతో ఆ ప్రయత్నాలు నీరుగారాయి. అమెరికాతో తాము ఎటువంటి ప్రత్యక్ష చర్చలు జరపడం లేదని ఇరాన్ వెల్లడించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా పంపిస్తున్న ప్రతిపాదనలు అర్థం లేని విధంగా ఉన్నాయని ఇరాన్ ఆరోపించింది.






