Viral: వీధుల్లో తిరుగుతున్నట్టు.. ప్రభుత్వ ఆస్పత్రిలో చక్కర్లు కొడుతున్న వీధి కుక్క

by Ramesh Naini |

ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితికి అద్దం పట్టే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Viral: వీధుల్లో తిరుగుతున్నట్టు.. ప్రభుత్వ ఆస్పత్రిలో చక్కర్లు కొడుతున్న వీధి కుక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితికి అద్దం పట్టే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వీధుల్లో తిరుగుతున్నట్టు.. ప్రభుత్వ ఆస్పత్రిలో వీధి కుక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని జీఎస్‌వీఎమ్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో రోగులు ఉన్న చోటే ఒక వీధి కుక్క యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తామన్న వికాసం ఇదేనా?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అత్యంత శుభ్రంగా, సురక్షితంగా ఉండాల్సిన గర్భిణీలు, బాలింతల వార్డులో కుక్కలు తిరగడం ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శలు వస్తున్నాయి. ముందే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అంతంత మాత్రమేనని, కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కట్టుదిట్టమైన భద్రత, సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story