- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన డిమాండ్
పంజాబ్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని పంజాబ్ (Panjab) బీజేపీ స్టేట్ చీఫ్ సునీల్ కుమార్ జాఖర్ (BJP State Chief Sunil Kumar Jakhar) సంచలన డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని పంజాబ్ (Panjab) బీజేపీ స్టేట్ చీఫ్ సునీల్ కుమార్ జాఖర్ (BJP State Chief Sunil Kumar Jakhar) సంచలన డిమాండ్ చేశారు. భారత్ -పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ భారత సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులకు కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్, పంజాయ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు జరిపింది.
ఈ నేపథ్యంలోనే శనివారం భారత్- పాక్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. భారతదేశం (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒప్పందం కుదరడం శుభ పరిణామం అని అన్నారు. ఈ ఒప్పందాన్ని రెండు దేశాలు అంగీకరించాయనే శుభవార్త తమకు అందిందని తెలిపారు.
ఇది పంజాబ్‌కు చాలా ముఖ్యమైనది అని, ఉగ్రవాదంపై యుద్ధంలో.. పంజాబ్ 'కురుక్షేత్ర' భూమిగా ఉందని, దీనిపై పంజాబ్ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అంతేగాక భారత దేశ సరిహద్దు రాష్ట్రంగా తాము కూడా ఉగ్రవాదంపై యుద్ధం చేసామని అన్నారు. ఇక పంజాబ్‌కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ (Special Package) కోసం డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం (Union Government) ముందు లేవనెత్తుతామని, దీనిపై కేంద్రం అర్థవంతమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు బీజేపీ నేత (BJP leader) వెల్లడించారు.






