- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ పేరుమీద తీసుకున్న సిమ్‌తో ఫ్రాడ్ జరిగితే యజమానిపై కూడా కేసు..టెలికాం శాఖ హెచ్చరిక
సిమ్ కార్డుల దుర్వినియోగం, ఐఎంఈఐ ట్యాంపర్డ్ మొబైల్స్ వినియోగంపై టెలికమన్యూనికేషన్ శాఖ అప్రమత్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మొబైల్ వినియోగదారులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇకపై మీ పేరు మీద తీసుకున్న సిమ్‌కార్డులను సైబర్ మోసాలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించినట్లు తేలితే ఆ నేరంలో మీ ప్రమేయం లేకపోయినా వాటి అసలు యజమానులు మీరే అయితే చర్యలు తీసుకుంటామని టెలికాం విభాగం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో మొబైల్ కనెక్టివిటీ వేగంగా పెరుగుతోందని ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ నంబర్ల ట్యాంపరింగ్ పెరిగిపోతున్నాయని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ట్యాంపర్డ్ ఐఎంఈఐ నంబర్‍లతో ఉన్న మొబైల్స్‌ను ఉపయోగించకుండా ఉండాలని అప్రమత్తం చేసింది. మోసపూరిత మార్గాల ద్వారా సిమ్‌కార్డులు సేకరించడం, ట్యాంపరింగ్ చేయబడిన ఐఎంఈఐ నంబర్ ఉన్న మొబైల్ పరికరాల ద్వారా మోసాలు జరిగినా ఇందులో సైబర్ నేరగాళ్లతో పాటు అసలు వినియోగదారుడు కూడా నేరస్థుడిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిలో గరిష్టంగా 3 సంవత్సరాల జైలుశిక్ష, రూ. 50 వేల వరకు జరిమానాతో పాటు రెండు కలిపి విధించవచ్చని పేర్కొన్నది. వినియోగదారులు తమ మొబైల్ ఐఎంఈఐ నంబర్ సరైనదేనా లేక ట్యాంపర్ చేసినదా? మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? వంటి వివరాల కోసం సంచార్ సాథీ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా తెలుసుకోండి..
- ప్లే స్టోర్ నుంచి సంచార్ సాథీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా https://www.sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఇక్కడ చూపించే నో మొబైల్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్ ఆప్షన్ ఎంచుకోండి.
- అక్కడ మీ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ బటన్ నొక్కగానే మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన నంబర్లు డిస్ ప్లే అవుతాయి.
- మీ మొబైల్ హ్యాండ్‌సెట్ జెన్యూన్‍నా? కాదా అని తెలుసుకునేందుకు https://ceir.sancharsaathi.gov.in/Device/SancharSaathiKym.jsp లింక్‌లో వివరాలు నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు.






